Header Banner

ఏపీ రైతులకు ఈ పథకం గురించి తెలుసా..! ప్రతి నెలా రూ.3వేలు..!

  Mon May 19, 2025 11:31        Politics

ఆంధ్రప్రదేశ్‌‌లో రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం గురించి తెలుసా.. కేంద్రం చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్‌గా అందిస్తారు. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు అర్హులు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు, PM కిసాన్ లబ్ధిదారులు ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవచ్చు. పన్ను చెల్లించేవారు, ఇతర సామాజిక భద్రత పథకాలలో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు.

ఈ పథకంలో చేరడానికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. 18 ఏళ్ల వయసున్న రైతు నెలకు రూ.55 చెల్లిస్తే.. కేంద్రం అంతే మొత్తం రూ.55 కలిపి మొత్తం రూ.110 జమ చేస్తారు. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. 21 ఏళ్ల వయసున్న రైతులు రూ.61, 25 ఏళ్ల వారు రూ.80, 30 ఏళ్ల వారు రూ.106, 35 ఏళ్ల వారు రూ.150, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్‌ వస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే.. వారి నామినీకి జీవితాంతం నెలకు రూ.1500 పింఛన్‌ వస్తుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కు వెళ్లాలి. అక్కడ PM-KMY పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, నామినీ వివరాలు అందజేయాలి. దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని.. రైతు సంతకం చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత పింఛన్ కార్డు వస్తుంది.. PM కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఈ పథకం గురించి రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్రం అందించే కొన్ని పథకాల గురించి రైతులకు సమాచారం ఉండకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సంబంధిత
ప్రభుత్వ అధికారులు వారికి అవగాహన కల్పించి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచనల్ని చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APFarmersScheme #MonthlySupport #FarmerWelfare #AndhraPradesh #3KForFarmers #AgriSupport #GovernmentScheme